భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: క్రీడలు యువతలో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శనివారం నిర్వహించిన జిన్నారం క్రికెట్ లీగ్ ఇండిపెండెన్స్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని…