భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం రాష్ట్రంలోనే తొలి గ్రామంగా గ్రామైక్య మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి సీఆర్డీ ఉషారాణి వెల్లడించారు. గ్రామంలో పనిచేస్తున్న రెండు గ్రామైక్య మహిళా సంఘాల పరిధిలోని మొత్తం 34 స్వయం సహాయక మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

గత…