భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.