భారత్ సమాచార్ నెట్, మహబూబాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించే ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని డీసీసీ అధ్యక్షురాలు డా. భూక్య ఉమా మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డితో కలిసి మహిళలు వేసిన రంగురంగుల రంగవల్లులను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. మహిళల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి…





