భారత్ సమాచార్.నెట్, నల్గొండ: నల్గొండ పట్టణంలోని డైట్ కాలేజీ సమీపంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఆరు నెలల ప్రేమ బంధం విషాదంగా ముగిసింది. ప్రేమ పేరుతో మైనర్ ఇంటర్ విద్యార్థినిని స్నేహితుడి గదికి తీసుకెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ గౌడ్, ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు కృష్ణ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని కథనాలు





