భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న మాతాజీ హార్డ్వేర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. మంటలను గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో అవి గోదాంలోని ఇతర…





