భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నర్సాపూర్ విద్యుత్ కార్మికులు సమ్మె బాట పట్టారు. టీవీ ఏవీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీగా జిల్లా కేంద్రంలోని డివిజన్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు, కన్వీనర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండివైఖరి వీడి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వారు…