భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా నిజాంపేట మండల కేంద్రంలో పోలీసులు సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ డిటెక్టివ్ డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి స్థానిక కిరాణా షాపులు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మండలంలో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మత్తు పదార్థాల రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం…





