భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ చేతుల మీదుగా భోయ లక్ష్మన్న (మరణాంతరం) భార్య భోయ సరస్వతికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 1 లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్యకర్తల కుటుంబాలను ఎప్పటికీ విస్మరించబోమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




