భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 373 దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్‌కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, ఆర్‌డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,…