భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గుండంరాజుపల్లి గ్రామంలో బుధవారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ గునిగంటి కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు అపరిష్కృత సమస్యలను సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గుండంరాజుపల్లి-చిన్నగూడూరు ప్రధాన రహదారిపై జిన్నేల వాగు వద్ద వంతెన…