భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, అసైన్మెంట్ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ భూములను పరిరక్షించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మంగళవారం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్‌బో మెడోస్ కాలనీలో ప్రభుత్వ భూమి వివాదంపై ఆయన క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.

డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి కొనుగోలుదారులను మోసం చేసే డెవలపర్లు, కబ్జాదారులు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అయితే,…