భారత్ సమాచార్.నెట్, మెదక్: అనారోగ్యంతో బాధపడుతున్న వెల్దుర్తి గ్రామానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అమర్ (13) ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామానికి చెందిన మహమ్మద్ సురోద్దిన్ రెండవ కుమారుడైన అమర్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు అమర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే మహమ్మద్ అమర్ మృతి చెందడంతో వెల్దుర్తి గ్రామంలో విషాదం నెలకొంది.
ఉస్మానియాలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




