భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని మైనారిటీ బాలుర గురుకులంలోని  టెమ్రీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇటీవల నిర్వహించిన NEET MBBS మొదటి రౌండ్ కౌన్సిలింగ్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉచిత సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ ప్రిన్సిపాల్ జే.రాములు, కె.ఎస్. జమీల్ అభినందించారు. ఎమ్.డి. ఉబేద్ నాగర్ కర్నూల్, గౌతమ్ కన్న నిర్మల్, డీ. స్రుజన్ కుమార్ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో సీట్లు పొందారని వారు తెలిపారు. విద్యార్థులు మరింత…