భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్, కరపత్రికలు, స్టిక్కర్ లను ఆయన ఆవిష్కరించారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను వనపర్తి జిల్లాలో అత్యంత సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా రోడ్డు రవాణా అధికారులతో కలిసి జాతీయ రోడ్డు భద్రత…