భారత్ సమాచార్, నంద్యాల ;

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు ఆంధ్రా పోలీసులకు సవాల్ విసురుతోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఏనిమిదేళ్ల బాలిక అదృశ్యమై వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పటికి కేసుకు సంభందించిన పూర్తి ఆధారాలు లేవు. మైనర్లైన ముగ్గురు నిందితులు దొరికారు…అత్యాచారం చేశాం. చంపేశాం. ఇది నిందితులు ఇచ్చిన వాగ్మూలం. కానీ బాలిక శవం మాత్రం ఇంకా దొరకలేదు. నిజాలు బయట పడటం లేదు. కేసు నిరూపణకు ఆధారాలు దొరకటం లేదు. సాక్ష్యాలు సంపాదించటం…