భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశవాప్తంగా శ్రీకృష్టాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన‌ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉప్పల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌‌లో ఊరేగింపు ముగిశాక రథాన్ని లోపలికి తోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో దాన్ని పక్కకు నిలిపివేసిన యువకులు…