భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ నివాసంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని 10వ వార్డ్ సభ్యులు, పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ దుర్గాప్పగారి అశోక్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.