భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని శ్రీ లలిత కామేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతుల పుత్రికగా జన్మించి, ఆత్మగౌరవం కోసం 102 గోత్రాల వారితో కలిసి అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి వాసవి మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు.
జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి 50 కేజీల మల్లెపూలతో విశేష పూలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఆర్యవైశ్య…





