భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : నర్సాపూర్ నియోజక వర్గం దత్తాచల క్షేత్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం దత్త జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ శివారులో గల దత్తాచల క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

క్షేత్రంలో వెలసిన స్వయంభు ఏకముఖ దత్తుడిని దర్శించడం ఎంతో ఆనందంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు.…