భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పప్పుల మహాలక్ష్మి (45) అనే మహిళా రైతు పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. వెంటనే ఆమెను పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం మణుగూరులోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు బంధువులు తెలిపారు.
మరిన్ని కథనాలు





