భార‌త్ స‌మాచార్, టెక్నాల‌జీ : స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో చాలామందికి రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి అలాగే వదిలేయడం అలవాటు. అయితే ఎక్కువసేపు ఛార్జింగ్‌కు కనెక్ట్‌ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యకు వినూత్న పరిష్కారంగా చైనాకు చెందిన Kuwajia సంస్థ ఆటో ఎజెక్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని పరిచయం చేసింది. బ్యాటరీ 100 శాతం ఛార్జింగ్‌ కాగానే ఛార్జర్‌ కనెక్టర్‌ ఫోన్‌ నుంచి ఆటోమేటిక్‌గా బయటకు రావడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు…