భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ నవంబర్ 5న తన 38వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ రన్ మెషీన్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టిన కోహ్లీ.. తన కెరీర్‌లో మరికొన్ని అరుదైన ఘనతలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సమం చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. అయితే ఈ లక్ష్యాలన్నీ…