భార‌త్ స‌మాచార్, సినిమా : భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రానికి నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యాధునిక సాంకేతికత, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. విడుదలైన తొలి రోజు నుంచే సినిమాకు సంబంధించిన స్పందనలు, ముఖ్యంగా కీలక సన్నివేశాలపై చర్చలు సోషల్ మీడియాలో…