భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
అత్యధిక కాలం బంగ్లాదేశ్ కు ప్రధానిగా కొనసాగిన షేక్ హసీనా పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటుగ మాజీ మంత్రులు, అనుచరులపై కూడా తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. బంగ్లాదేశ్‌లో రైఫిల్స్‌లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా అబ్దుల్ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్‌ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో…

