భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ నమోదు ఫారాల స్వీకరణ ప్రక్రియ గుమ్మడిదల మండల కేంద్రంతో పాటు గుమ్మడిదల, అన్నారం మున్సిపాలిటీల పరిధిలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కావలి ఐలేష్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సార సృజనలక్ష్మి పాల్గొని ఓటర్ల నుంచి ఎస్‌ఐఆర్ ఫారాలను స్వీకరించారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 9 పోలింగ్ కేంద్రాలకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), బీజేపీ బీఎల్‌ఏ-2…





