భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న జైల్ భరో కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. బొంతపల్లి కమాన్ సమీపంలోని ప్రధాన రహదారిపై చేపట్టిన ఈ నిరసనతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య మాట్లాడుతూ దేశానికి మంచి భవిష్యత్తు కావాలంటే…





