భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన అంతిమయాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ్ సారధి, వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్.కె. బాసు మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొని ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ…