భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మండల కేంద్రంలోని ఇంద్రసేన రెడ్డి ఫంక్షన్ హాల్లో 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా సమావేశమై “ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ సర్వీస్ ఫర్ సొసైటీ” పేరుతో సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. తమ స్నేహబంధాన్ని సమాజ సేవకు అంకితం చేయాలనే సంకల్పంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ట్రస్ట్ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలను విస్తరించి సమాజానికి ఉపయోగపడే విధంగా ట్రస్ట్‌ను నడపాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్…





