భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.…