భార‌త్ స‌మాచార్.నెట్, శ్రీ‌కాకుళం: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు మూడు వేర్వేరు కేసుల్లో ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి మొత్తం 84.81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మొదటి కేసులో, ఒడిశాలోని రాయఘడ జిల్లాకు చెందిన గంట జైశ్వా, స్వప్న బిబార్ అనే ఇద్దరు వ్యక్తులు 40.24 కిలోల గంజాయిని పలాస రైల్వే స్టేషన్‌కు బస్సులో తీసుకువస్తుండగా ఎస్సై ఆర్.నర్సింహమూర్తి తనిఖీల్లో…