భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచుల చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి 18 మండలాలకు చెందిన సర్పంచులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలోని 482 గ్రామపంచాయతీలలో సుమారు 450 మంది సర్పంచులు పాల్గొని గ్రామపంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సర్పంచుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా సర్పంచుల ఐక్యత కోసం నిర్వహించిన కార్యక్రమమని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి…