భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ అశోక్‌రావు చవాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం అశోక్‌రావు చవాన్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బాలాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు…