భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా అభివృద్ధి…





