భారత్ సమాచార్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: రాంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో జూలై 25 నుంచి ఆగస్టు 1, 2026 వరకు వారంరోజుల పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, కంపెనీ యాజమాన్యాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు 2000 సంవత్సరంలో 45…