భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిలోని ప్రభుత్వ వెల్నెస్ సెంటర్ ఉద్యోగుల పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన విరామం నిర్ణీత సమయాల్లో ఉంటుంది. అయితే సంగారెడ్డి వెల్నెస్ సెంటర్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకే లంచ్ బ్రేక్ ప్రకటించి, వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉద్యోగుల తీరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మంగళవారం వెల్నెస్ సెంటర్‌కు వైద్యం కోసం వెళ్లిన కొందరు ఉద్యోగులు,…