భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అనుమతికి మించి వైద్య చికిత్సలు అందిస్తున్న క్లినిక్‌లపై అధికారులు కొరడా ఝళిపించారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, దౌల్తాబాద్ ప్రాంతాల్లో గురువారం వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న ఏడు క్లినిక్‌లతో పాటు ఓ హెల్త్‌కేర్ ల్యాబ్‌ను సీజ్ చేసినట్లు డీఐఓ డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే తెలిపారు.

మండల కేంద్రమైన హత్నూరలో మూడు, దౌల్తాబాద్‌లో నాలుగు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. అలాగే హెల్త్‌కేర్ ల్యాబ్‌పై కూడా చర్యలు…