భారత్ సమాచార్.నెట్, విజయనగరం జిల్లా: గరివిడి మండలం తోండ్రంగి గ్రామంలో నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. గరివిడి ఎస్సై లోకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22)కు అదే గ్రామానికి చెందిన వివాహితుడు రాము నాయుడుతో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
కుటుంబ సభ్యులు అఖిలకు మరో యువకుడితో వివాహం నిశ్చయించి గురువారం నిశ్చితార్థం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.…





