భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి యాసంగి సాగుకు నీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొక్కజొన్న, జొన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీపై అందుబాటులోకి తీసుకొచ్చింది. రామాయంపేట మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా ప్రస్తుతం యాసంగి పంటలకు సరిపడా నీరు అందుబాటులో లేని పరిస్థితులు…






