భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధ్యాపక, విద్యార్థి సమన్వయకర్తలతో కలిసి, గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 140 మంది విద్యార్థి స్వచ్ఛంద సేవకులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని, రక్తదానం చేశారు. దాతలకు ఎన్టీఆర్ ట్రస్టు ప్రశంసా పత్రాలను…
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో రక్తదాన శిబిరం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




