భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తిలో వద్దిరాజు నారాయణ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ కుమారులు, గాయత్రీ గ్రూప్ అధినేతలు వద్దిరాజు కిషన్, ఎంపీ రవిచంద్ర, దేవేందర్, పెద్ద వెంకన్న, మోహన్, చిన్న వెంకన్నలు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్మృతి వనంలోని తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తమ తండ్రితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని, ఆయన అందించిన స్ఫూర్తిని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.…





