భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని అదుర్తి సూర్యకుమారి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చితలూరి సుధాకర్ మార్గదర్శకత్వంలో ఆమె ఈ పరిశోధన పూర్తి చేశారు. ఆమె ‘పైనారో పైరజోల్స్, ట్రయాజోల్ పొందుపరచిన బెంజోక్సాజోల్ ఆక్సాజోల్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, లక్షణం’పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. పునర్వినియోగించదగిన ఉత్ప్రేరకాన్ని ఉపయోగించి పైరానో, స్పిరో పైరజోల్స్ కోసం సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల (గ్రీన్ కెమిస్ట్రీ) సింథటిక్ పద్ధతులను అభివృద్ధి…