భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: న్యూఢిల్లీలోని భారత సైన్యం, పదాతిదళ ప్రధాన కార్యాలయం కోసం ‘రక్షణ సేకరణ నిర్వహణ వ్యవస్థ’ అభివృద్ధి, విస్తరణకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తోడ్పాటును అందించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆచార్యురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రధాన పరిశోధకురాలిగా వ్యవహరించిన ప్రొఫెసర్ ప్రీతి 2025 మే నుంచి నవంబర్ వరకు ఈ ప్రాజెక్టును నడిపించారు. నిరంతరం దశలవారీ…