భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రూప్ 1, 2, 3, 4, ఆర్ఆర్‌బీ, ఎస్సై, కానిస్టేబుల్, ఎస్ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు స్థానిక టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.నగేష్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సింధు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ బీ.శ్రీకాంత్ లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ…