భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలు తమకు నచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తున్నారు. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలంపాట వేశారు. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వారే సర్పంచుగా ఉండాలని రూ.73 లక్షలకు వేలంపాట వేయగా మహమ్మద్ సమీనా ఖాసీం అనే…