భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలంలో ప్రకటించిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. విజేతలను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అందరకితో కలిసి ముందుకు సాగాలని ఆయన సూచించారు.






