భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : మహబూబాబాద్ డిపో ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. డిపో మేనేజర్ వి.కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిపోలోని మహిళా ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, వారి పిల్లలు, బంధువులతో కలిసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశారు. ఈ వేడుకలు కేవలం సంప్రదాయాన్ని చాటడమే కాకుండా, ఉద్యోగుల మధ్య ఐకమత్యాన్ని,…





