భారత్ సమాచార్ , సిద్ధిపేట: గజ్వేల్ పట్టణంలో ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువలను మూసి వేయడం వలన పలు కాలనీలు, హాస్పిటల్స్ ముంపుకు గురవడం జరుగుతుంది. ఈ సమస్యకు సిద్దిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శనివారం మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన, ధర్నా నిర్వహించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని…





