భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పరిధిలోని రామప్ప గుట్టపై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారిని శుక్రవారం బీజేపీ నాయకులు దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, కాళ్లకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మొక్కులు చెల్లించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ రూరల్ అధ్యక్షులు పిట్ల పోచయ్య, మనోహరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిల్లా నాయకులు వెంకటేష్,…





