భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు. పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మరిన్ని కథనాలు





